చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా మారిన తనీష్, ఈ మధ్యనే బిగ్ బాస్ హౌస్ కూడా వెళ్లి, తనేంటో అందరికీ పరిచయం చేసే పనిలో ఉన్నాడు. అయితే, బయట అతని పుట్టిన రోజు సందర్భంగా అతని “రంగు” సినిమా ట్రైలర్ ని మూవీ టీం రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని కూడా గత ఏడాది ఇదే టైంలో తన బర్త్ డేకి రిలీజ్ చేశారు. అంటే, టీజర్ కి ట్రైలర్ కి సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. అయితే, గత ఏడాదిలో, తనీష్ సందీప్ కిషన్ హీరోగా చేసిన నక్షత్రం సినిమాలో విలన్ గా చేశారు. బహుశా, ఈ ఆలస్యానికి అది ఒక కారణం కావొచ్చు. మొత్తానికి, రంగు ట్రైలర్ బయటకి వచ్చింది, అలాగే సినిమా తనీష్ బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన తరువాత చేయవచ్చు. ఇంకో రెండు వారాలలో షో అయిపోతుంది కాబట్టి ఈ సినిమా కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేసే అవకాసలున్నాయ్.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఇక్కడ రంగు అంటే మనం హోలీ రోజు కొట్టుకునే రంగు కాదు, రక్తం అని అర్థం. ఈ సినిమా ట్రైలర్ చుసిన తరువాత అనిపించినా మొదటి విషయం మళ్ళీ విజయవాడ రౌడీఇజం ఛాయలని చూపిస్తున్నరేమో అని. ఎందుకంటే, ట్రైలర్ లో ఉన్న లొకేషన్స్, డైలాగ్స్ ఈ సినిమా విజయవాడ నేపధ్యం లో తీసినట్టు పక్కాగా చెప్తున్నాయ్. కాగా, ఇది బాగా వయలెంట్ గా తీసిన సినిమాగా కనిపిస్తుంది. నక్షత్రం సినిమాలో విలన్ గా ఏ లుక్ తో అయితే అందరి చేత ప్రశంసలు అందుకున్నాడో, అదే షేడ్స్ ఈ ట్రైలర్ లో కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఒక కుర్రాడు రౌడీ మారిన తీరు ఉన్నట్టు కనిపిస్తుంది ఈ ట్రైలర్ లో. నిజానికి, ఇలాంటి ఉద్దేశ్యంతో చాలానే కథలు వచ్చాయ్, అయితే నిజంగా ఇది అలాంటిదో లేక ఇంకేమయిన ఉందో చూడాలి. అయితే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారూ ఈ సినిమాలో కొన్ని పాటలు రాసారు, అలాగే వారి అబ్బాయి యోగేశ్వర శర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు. యోగేశ్వర శర్మ గతంలో వరుణ్ సందేశ్ చేసిన “కుదిరితే కప్పు కాఫీ” సినిమాకి సంగీతం ఇచ్చారు. అసలు ఆ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది అండ్ ప్రతీ పాట కూడా చాలా బావుటుంది.
నటీనటులు: తనీష్, ప్రియా సింగ్
దర్శకుడు: కార్తికేయ
నిర్మాత: ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు
సంగీతం: యోగేశ్వర శర్మ