Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నరసింహ అనే బ్లాక్ బస్టర్ మూవీలో సూపర్ స్టార్ రజనికి ఓ ఫేమస్ డైలాగ్ వుంది. “అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు సుఖపడ్డ దాఖలాలు చరిత్రలో లేవు” అని. ఈ సినిమా అప్పట్లో సూపర్ పాపులర్. ఇప్పుడు “అతిగా ఆవేశపడే ఆడది.. ఆశ పడే మగాడు” అనే టైటిల్ తో ఓ సినిమా తీస్తే బాగుంటుందని ఓ ప్రపోజల్ వచ్చింది. ఈ సినిమాలో వైసీపీ అధినేత జగన్, నాయకురాలు రోజా చేస్తే బాగుంటుందట. ఆ ఇద్దరి క్యారెక్టర్లు ఆ టైటిల్ కి బాగా సూట్ అవుతాయని అంటున్నారు విజయవాడకి చెందిన టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ.
వైసీపీ ప్లీనరీ తర్వాత టీడీపీ నాయకుల్ని ఉద్దేశించి రోజా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. లోకేష్ ని కమెడియన్ గా అభివర్ణించిన రోజాని కౌంటర్ చేయడానికి పంచుమర్తి అనురాధ రంగంలోకి దిగారు. టైటిల్ చెప్పి మరీ సినిమా ప్రొపోజల్ పెట్టారు. రాజకీయ విమర్శ కోసమే అనురాధ ఈ ప్రతిపాదన తెచ్చినా ఆమె సమయస్ఫూర్తి, చమత్కారం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. రోజా ఎంత ఆవేశంగా మాట్లాడతారో అందరికీ తెలుసు. ఇక జగన్ ఆశ గురించి చూస్తూనే వున్నాం. తాను సీఎం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పడమే కాదు, ఇది ప్రజాస్వామ్యం అని మరిచి 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పడమే అందుకు ఉదాహరణ.
మరిన్ని వార్తలు