టీడీపీ నేత గన్ పేలుడు…మహిళకు గాయాలు !

TDP leader's gun misfire injures woman in Kurnool

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్నూలు జిల్లా టీడీపీ నేత లక్ష్మారెడ్డికి చెందిన గన్ ప్రమాదవశాత్తు పేలిన ఘటనలో ఓ మహిళ చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ప్రమాదవశాత్తు గన్ పేలిన ఘటనలో తలాలి లక్ష్మీదేవి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో చోటుచేసుకుందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి, గన్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గన్ కు లైసెన్స్ కూడా ఉంది. గన్ శుభ్రం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు.