గ్లామర్ విషయంలో గత కొన్నేళ్లుగా హద్దులు చెరిపేసినా అమలా పాల్.. తాజాగా చేసిన ‘‘ఆమె’ సినిమా విషయంలో ఏకంగా కంచెనే దాటేసింది. వివరాల్లోకి వెళితే.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసిన అమలా పాల్..ఆ తర్వాత తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ విజయ్‌ను పెళ్లి చేసుకొంది సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చేసి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.తాజాగా అమలాపాల్ తమిళంలో ‘ఆడై’ పేరుతో ఒక సినిమాను చేస్తోంది. ఈ సినిమాను తెలుగులో ‘ఆమె’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేసారు. ఈ టీజర్‌లో కుమార్తె కనిపించడం లేదని పోలీసుకు ఓ తల్లి కంప్లైట్ చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళతారు. తీరా ఒక పెద్ద బిల్డింగ్‌లో అమలా పాల్ ఉంటుంది. కానీ ఆమె ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా ఉండదు. వెబ్ సీరీస్ లో నగ్నత్వం కామన్ అయిపోయింది కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో మాత్రం సంచలనమే. టీజర్‌లో ఎటువంటి అసభ్యత లేకుండా చూపించినా.. అమలా పాల్ ఇలాంటి సీన్‌లో చేయడం ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది. రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ టీజర్‌ను చూసిన సినీ ప్రముఖులు అమలపాల్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి పాత్రలు చేయడానికి నిజంగా ధైర్యం కావాలని ప్రశంసిస్తున్నారు. ఈ టీజర్‌ను చూసిన సమంత అమల్ పాల్ యాక్టింగ్‌ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసింది. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.