టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో యాంగ్రీస్టార్ రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్గా పరిచయం కాబోతోంది. దొరసాని అనే టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచీ ఈ సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది యూనిట్. తెలంగాణలోని ఒకప్పటి గడీల నేపధ్యంలో జరిగే ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. . తెలంగాణ యాసలో ఉన్న “వీనికేం తెల్వదు పీకదు… దొరసానులెప్పుడైనా బయటకు వత్తార్రా?”, “నేను చిన్న దొరసాన్ని ప్రేమిస్తానురా… అంటే దొరసాని కూడా నన్ను చూత్తాంది”, అలాగే మీ పేరు అని శివాత్మిక ఆనంద్ ని అడగడం అడిగితే ‘రాజు’ అని చెప్పి.. ‘మీరు దొరసాని’ అని మన ఆనంద్ అనడం వెంటనే శివాత్మిక ‘కాదు దేవికా’ అని అనడం.. వెంటనే ‘కాదు మీరు నా దొరసాని’ అని ఆనంద్ ఆనడం ఆకట్టుకుంది. అయితే ఇద్దరికీ మొదటి సినిమా కావడంతో కాస్త ఇద్దరూ ఎబ్బెట్టుగానే ఉన్నట్టు కనిపుస్తున్నారు. ఇక ఈ సినిమాని సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందించారు. సురేష్ బాబు ఈ సంవత్సరం రిలీజ్ చేసిన చిన్న సినిమాలు కలిసిరాలేదు, ఈ సినిమా అయినా కలిసి వస్తుందేమో చూడాలి.