Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మొత్తానికి సస్పెన్స్ వీడిపోయింది. బుల్లి తెరపై నిన్న రాత్రి బిగ్‌బాస్ హంగామా మొదలైంది. సీజన్ వన్ ని తారక్ హోస్ట్ చేయగా అది టీఆర్పీలను ఎంతగా కొల్లగొట్టిందో తెలిసిందే. అయితే ఇప్పుడు సీజన్-2ను హోస్ట్ చేస్తున్న న్యాచురల్ స్టార్ నాని.. ‘వీధి చివర ఉంటాది.. ఓ టీ కొట్టు.. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం’ సాంగ్‌తో ఎక్సట్రాఆర్డినరీ ఎంట్రీ ఇచ్చాడు. ‘బిగ్ బాస్ సీజన్ 1తో సంచలనాలను క్రియేట్ చేసిన తారక్‌కి థ్యాంక్స్’ అంటూ హౌస్‌లోకి వచ్చాడు నాని. 106 రోజులపాటు 16 మంది సెలబ్రిటీలతో సందడి చేయనున్న బిగ్ బాస్ హౌస్ పార్టిసిపెంట్స్ ఎవరనే విషయమై ముందు నుండి రకరకాల పేర్లు వినిపించాయి. ఇవాళ షో ప్రారంభమవడంతో ఆ సస్పెన్స్ వీడింది. షోలో వరుసగా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వీరే.. మొత్తం 16 మంది ఈ పోటీలో పాల్గొంటుండగా, అందులో 13 మంది సెలబ్రిటీలు, మిగతా ముగ్గురు సామాన్యులు కావడం విశేషం.
హౌస్‌లోకి వెళ్లిన మొదటి సెలబ్రిటీ నేపథ్య గాయని గీతామాధురి కాగా, తర్వాత వరుసగా నటుడు అమిత్ తివారీ, న్యూస్ ప్రెజెంటర్ దీప్తి, ప్రముఖ హేతువాది బాబు గోగినేని, నటుడు తనీష్, నటి భానుశ్రీ, గాయకుడు రోల్ రిదా, యాంకర్ శ్యామల, నటుడు కిరిటి దామరాజు, ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ దీప్తి సునయన, కౌశల్, తేజస్వీ, సామ్రాట్ రెడ్డి, ఇక సామాన్యుల కోటా నుండి గణేశ్, సంజన అన్నె (మోడల్), నూతన్ నాయుడు ఉన్నారు. ఆదివారం సెలబ్రిటీల పరిచయంతోనే సరిపోయింది, ఇక నుంచి రోజూ హౌస్‌లో మసాలా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి !