Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రం విడిపోతే టాలీవుడ్ ఆంధ్రకు వెళ్తుందని ప్రచారం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మొదటి రెండేళ్లలో జరిగిన చాలా పరిణామాలు కూడా అందుకు ఊతమిచ్చాయి. నాగార్జున్ ఎన్ కన్వెన్షన్ వ్యవహారం, అయ్యప్ప సొసైటీ రగడతో అందరూ ఇది నిజమే అనుకున్నారు. కానీ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలతో సీన్ మారిపోయింది.
కేటీఆర్ వ్యూహాత్మకంగా సినీపెద్దలకు దగ్గరగా జరిగి వారిలో భయాలు పోగొట్టారు. అంతా బాగుందనుకున్న టైమ్ లో డ్రగ్స్ కేసు వచ్చి పడింది. డ్రగ్స్ కేసులో బడాబాబుల పిల్లలున్నారని ఎక్సైజ్ ఫీలర్లు వదిలింది. పైగా టాలీవుడ్ రెండుగా చీలిందని, అగ్రనటులు ఓవైపు.. అప్ కమింగ్ స్టార్స్ మరోవైపు మోహరించారని కావాలనే చెబుతోంది.
దీంతో మరోసారి టాలీవుడ్ ఛలో అమరావతి అంటోంది. ఇప్పటికే మంత్రి లోకేష్ ఆ విషయం చెప్పేశారు.భారీగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టిన టాలీవుడ్ పెద్దలు కూడా అదే దిశలో ఆలోచిస్తున్నారు. డ్రగ్స్ కేసు అనంతర పరిణామాల్ని బట్టి కఠిన నిర్ణయాలు తీసుకుంటారట. చూద్దాం ఈసారైనా టాలీవుడ్ అమరావతికి వెళ్తుందో.. లేదో.
మరిన్ని వార్తలు: