తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఓయూలో నిరసనలు, ధర్నాలను నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆ క్రమంలో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించేందుకు కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసుకెళ్లారు. అయితే, ముందుగా అంచనా వేసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.