వరంగల్ లో అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని రసమయి బాలకిషన్ కామెంట్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఆట పాటల వల్ల తెలంగాణ రాలేదు అని కె.కేశవరావు అన్నారు. ఆ మాటలు వెనక్కి కేకే వెనక్కి తీసుకోవాలని ఫైర్ అయ్యారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంను అవమానించడం దారుణమన్నారు.
పాట లేకుంటే లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదన్నారు రసమయి బాలకిషన్. ముసలితనంకు వచ్చిన కేకే మతి భ్రమించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లో పట్టించుకోని కేకే కు BRSలో ఎన్నో పదవులు కేసీఆర్ ఇచ్చారంటూ కామెంట్స్ చేశారు రసమయి బాలకిషన్. కడియం శ్రీహరికి ఏమి తక్కువ చేశామని పార్టీ మారిపోయారు. కడియం శ్రీహరి ని రాజకీయంగా బొంద పెట్టడానికి వరంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సీట్ల విషయం లో అన్యాయం చేసిందని రసమయి బాలకిషన్ ఫైర్ అయ్యారు.