టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “ది ఫ్యామిలీ స్టార్”..!

"The Family Star" all set for TV premiere

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరుస మూవీ లతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా ది ఫ్యామిలీ స్టార్ (The Family star) మూవీ లో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ గా వచ్చి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకి రానున్నది .

"The Family Star" all set for TV premiere
“The Family Star” all set for TV premiere

వచ్చే ఆదివారం ఈ మూవీ సాయంత్రం 6:00 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానున్నది . మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి గోపీ సుందర్ సంగీతం అందించగా, పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.