గ్లోబల్ స్టార్ హీరోయిన్ ‘ప్రియాంక చోప్రా’ ‘టైగర్’ అనే డాక్యుమెంటరీలో అంబా అనే ఆడపులి పాత్రకి డబ్బింగ్ చెప్పింది. ఐతే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి ‘ప్రియాంక చోప్రా’ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది. ఇంతకీ ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే విందాం .. ‘‘నేను ప్రకృతికి సంబంధించిన మూవీ లను బాగా ఇష్టపడతాను. ఒక విధంగా పెద్ద అభిమానిని కూడా . మనదేశం నుంచి వస్తున్న ‘టైగర్’ అనే కథని నా గొంతుతో ప్రేక్షకులకు దగ్గరవడం నేను గొప్ప అవకాశంగా భావిస్తున్నాను’ అని ‘ప్రియాంక చోప్రా’ చెప్పింది.
‘ప్రియాంక చోప్రా’ ఇంకా మాట్లాడుతూ.. ‘నేను ఒక నటిగా ఎన్నో పాత్రలను చేశాను. కానీ.. ఇప్పుడు కేవలం నా వాయిస్‌తోనే అనేక భావోద్వేగాలని పలికించాలి. అలాగే, ఆ ఎమోషన్స్ ను నా మాడ్యులేషన్ తోనే పండించగలగాలి. నిజంగా ఇది ఒక పెద్ద సవాలే. ఏది ఏమైనా వేరే మూవీ కి నా వాయిస్ అందించాలనే నా కోరిక ఈ ‘టైగర్’తో నెరవేరింది అని ‘ప్రియాంక చోప్రా’ తెలిపింది. అన్నట్టు ‘టైగర్’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానున్నది .