సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీ కు (Tillu Square) యూత్ నీరాజనం పడుతున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ నుంచే బాగా హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ థియేటర్లోకి వచ్చిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నది . అయితే డిజె టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ చరిత్ర సృష్టించింది. అయితే.. గత 5 రోజుల్లో ఏకంగా 85 కోట్లు వసూలు చేసింది టిల్లు స్క్వేర్ మూవీ . ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వల్ మూవీ లు పెద్దగా ఆకట్టు కోవనే ప్రచారం ఉంది. అయితే ఆ ప్రచారానికి టిల్లు స్క్వేర్ మూవీ బ్రేక్ వేసింది. ఇటీవల రిలీజైన టిల్లు స్క్వేర్ మూవీ బంపర్ హిట్ అయింది. దీంతో బాహుబలి 2 , దృశ్యం 2, కేజిఎఫ్ 2, హిట్ 2, బంగార్రాజు, కార్తికేయ 2 లాంటి సీక్వెల్ హిట్ మూవీ ల సరసన టిల్లు గాడు చేరిపోయాడు.కాగా ఈ మోస్ట్ ఎంటర్టైనర్ మూవీ ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకి సొంతం చేసుకుందట. దాదాపు రూ. 14 కోట్లు పెట్టి టిల్లు గాడి ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్నారట. ఇక ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానల్ భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది . .