టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన మూవీ ల్లో “డీజే టిల్లు” తనకి పెద్ద బ్రేక్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ మూవీ కి అవైటెడ్ సీక్వెల్ గా “టిల్లు స్క్వేర్” ని అయితే ఇప్పుడు తాను తీసుకురాబోతున్న సంగతి కూడా తెలిసిందే. మరి దీనిపై కూడా మంచి బజ్ నెలకొనగా ఈ మూవీ ఫైనల్ గా ఈ మార్చ్ లో రిలీజ్ కి వచ్చేస్తుంది.
మరి సమయం దగ్గరకి పడుతుండగా అన్ని పనులు ఈ మూవీ కంప్లీట్ చేసుకుంటూ వస్తూ రిలీజ్ కు ముందు గానే సెన్సార్ కార్యక్రమాలని కూడా పూర్తి చేసేసుకుంది. మరి ఈ మూవీ కి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ను అందించినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీ పై అడల్ట్ కంటెంట్ విషయంలో ఒక టాక్ ఉన్న సంగతి తెలిసిందే.

దీనిపై రీసెంట్ గానే మేకర్స్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ అని తెలిపారు. అయినా చాలా మంది ఈ మూవీ ఏ సర్టిఫికెట్ రావచ్చనే అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దీనితో మరోసారి టిల్లు బాయ్ తన మ్యాడ్ ఎంటర్టైనింగ్ రైడ్ కు సిద్ధం అవుతున్నాడని చెప్పాలి.
ఇక ఈ మూవీ కి రామ్ మల్లిక్ దర్శకత్వం వహించగా యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. అలాగే రామ్ మిర్యాల సంగీతం అందించాడు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన ఈ మూవీ ఈ మార్చ్ 29న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
#TilluSquare is certified with 𝐔/𝐀
Tillanna is ready to BLAST the screens with DOUBLE the FUN & ENTERTAINMENT!
Worldwide grand release at theatres near you on MARCH 29th!
#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo… pic.twitter.com/kQpuu0AlFI
— Sithara Entertainments (@SitharaEnts) March 22, 2024