కేసీఆర్ ను ఉతికేసిన కోదండరాం

TJAC Chairman Kodandaram Fires On CM KCR Government Schemes

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

TJAC Chairman Kodandaram Fires On CM KCR Government Schemes

రాజకీయ ప్రత్యర్థులు విమర్శించారంటే అర్థం ఉంది. కానీ టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం కూడా ఈ మధ్య కాలంలో కేసీఆర్ పై ఒంటికాలిపై లేస్తున్నారు. కేసీఆర్ చిన్న చిన్న పనులు చేస్తూ.. అసలు సమస్యలు పరిష్కరించడం లేదని ఆయన మండిపడుతున్నారు. గతంలో ఆంధ్రా సీఎంల పాలనకు, కేసీఆర్ పాలనకు తేడా ఏమీ లేదన్నది కోదండరాం మాట.

అసలు తెలంగాణ ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శించడానికే భయపడ్డ రోజుల్లో.. కేసీఆర్ ను తిట్టిన ఘనత కోదండరాంది. మొదట్లో కోదండరాంపై ఎలా రియాక్టవ్వాలన్న చిన్న కన్ఫ్యూజన్ కూడా ఆయనకు కలిసొచ్చింది. కానీ కోదండ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. ఆయన శిష్యులైన ఓయూ విద్యార్థుల్ని ఉసిగొలిపి.. ఎంతోకొంత స్పీడు తగ్గించగలిగారు.

కానీ అడపాదడపా కోదండరాం సార్ నోటి నుంచి ఘాటు వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో చాలా సమస్యలున్నా.. ప్రభుత్వం పరిష్కరించడం లేదని, అదేమంటే తర్వాత చూద్దామని దాట వేస్తోందని ఆయన ఆరోపించారు. గొర్రెల పంపిణీ, రుణమాఫీ ఇలా ఏ స్కీమ్ తీసుకున్నా అవకతవకలు ఉన్నాయని, సమస్య ఎలా పరిష్కరించాలో వివరించి చెప్పినా.. సర్కారు పట్టించుకోవడం లేదని వాపోయారు కోదండరాం.

మరిన్ని వార్తాలు:

రజనీ గాలి తీసేసిన సర్వే