మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్నాడు. సరదాగా మీడియాతో ముచ్చటించిన త్రివిక్రమ్ సినిమా కష్టాలను గురించి, తన ఇష్టాయిష్టాలను గురించి చెప్పుకొచ్చారు. సినిమా తెరకెక్కించాలంటే చాలా ఓపిక అవసరం, ఎంతో క్లారిటీగా సీన్ చెబితే గాని రాసుకున్న విధంగా అవుట్‌పుట్ రాదు, మా కష్టాలను మాటల్లో వివరించలేం అంటూ దర్శకుడి శ్రమను తెలియజేశాడు. తనకు చిన్న పిల్లలంటే చాలా ఇష్టమని, పిల్లలని బాద పెట్టడం గాని, వాళ్లు బాదపుడుతుండడం చూసినా గానీ నేను తట్టుకోలేను. అందుకే నా సినిమాల్లో ఎప్పుడు చిన్న పిల్లలు బాద పడే సీన్‌లు ఉండవు, అలాంటివి వచ్చినా నేను వేరే రకంగా ప్లాన్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
కొన్ని సినిమాల్లో చిన్న ప్లిలను వేధించడం, వాళ్లను బాదపెట్టే సీన్స్ ఉంటాయి నేను వాటిని టీవీలో కూడా చూడలేను. ఇటీవల నయనతార నటించిన ‘కర్తవ్యం’ చిత్రంలో చిన్న పాప బోరు బావిలో పడడం చూపించారు. అలాంటి సీన్‌లు నేను భరించలేను. ఇక అలాంటి సినిమాలు వస్తే వెంటనే టీవీ కట్ చేస్తాను. కేవలం టీవీయే కాదు పేపర్‌లో, వార్తా ఛానెల్‌లో కూడా ఇలాంటి వార్తలు ఉంటే నేను చూడలేను. అందుకే అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను. నా సినిమాల్లో కేవలం వినోదాత్మక పాత్రలనే చూపించాలనుకుంటాను, ఎవరిని బాద పెట్టడం నాకు ఇష్టం ఉండదు అంటూ త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు.