టీఆర్ఎస్ కు భారీ షాక్…సైకిల్ ఎక్కనున్న మరో కీలక నేత…!

TRS Leader Budan Baig Shaik Resigns To TRS Party

ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ కు షాక్ తగలనుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ముంగిట పార్టీకి సీనియర్‌ నేత, ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్ (ఐడీసీ), ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బుడాన్‌ బేగ్‌ పార్టీకి రాజీనామా చేయనున్నారని మీడియాకి లీకులు వచ్చాయి. గత కొంత కాలంగా పార్టీతో అంటీముట్టనట్టు ఉంటున్న బేగ్‌ గురించిన తాజా నిర్ణయం టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కలకలం రేపిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కీలకంగా భావించే ఖమ్మంలో ఏకంగా జిల్లా అధ్యక్షుడు రాజీనామాతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మీద అసంతృప్తితో ఉన్న బేగ్‌తో టీడీపీ నేతలు ఇదివరకే మంతనాలు జరిపినట్లు సమాచారం. బుడాన్‌ రాజీనామా వార్తలతో కంగుతిన్న గులాబీ అధిష్టానం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును రంగంలోకి దింపి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. బేగ్‌ టీడీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బేగ్‌ ప్రస్తుతం ఐడీసీ ఛైర్మన్‌గా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు.

Budan-Baig-Shaik

జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆయనతో మహాకూటమి అభ్యర్థి టీడీపీ నేత నామా నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరుపొందిన బుడాన్ బేగ్ మైనారిటీ నేతగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్న బేగ్ ఈసారి టికెట్ల కేటాయింపు విషయంలో హైకమాండ్ పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తన వ్యతిరేకులకు పార్టీలో పెద్దపీట వేయడంతో పాటు తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆయన అలిగినట్లు బేగ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే బుడాన్ బేగ్ పార్టీని వీడనున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనతో పలుమార్లు చర్చలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ దే విజయమనీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకొవద్దని సూచించారు.

kcr thummala nageswarao

అయినప్పటికీ టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకే బేగ్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 35,000 మైనారిటీ ఓట్లపై బేగ్ ప్రభావం ఉండొచ్చన్న అంచనాతో ఆయనకు కీలక పదవి అప్పగించేందుకు మహాకూటమి నేతలు అంగీకరించారనీ, అందుకే బేగ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బేగ్ 1980వ ద‌శ‌కంలో వ‌రంగ‌ల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళశాల (REC)లో విద్యార్థి ఉద్య‌మాల్లో కీల‌క పాత్ర పోషించారు. ఆ త‌ర్వాత కేసీఆర్ పిలుపునందుకొని 2010 టీఆర్ఎస్ లో చేరారు. 1984 నుంచి 1988 వరకు రాడికల్ విద్యార్థి సంఘం (RSU) ప్రధాన కార్యదర్శిగానూ బేగ్ పనిచేశారు. అయితే 2014లో ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోటీ చేసి పొంగులేటి చేతిలో ఓడిపోయారు. 2015 నుంచి టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

TRS Party MPs And Former MLAsConflicts