రేవంత్ మాట నిజమే…తెరాసకు ఎంపీ భారీ షాక్…!

Congress Leader Vishweshwar Reddy About KCR Ruling

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. త్వరలో టీఆర్ఎస్ కు ఇద్దరు ఎంపీల రాజీనామా అంటూ రాజకీయ వర్గాల్లో కలవరం రేపిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హింట్ నిజమే అయ్యింది. రేవంత్ ఆడిన మాట నిజమైంది. రేవంత్ చెప్పినట్లుగానే టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ చేవెళ్ల ఎంపీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్‌కు పంపించారు. రాజీనామాకు గల కారణాలను బుధవారం మీడియా సమావేశంలో ప్రకటిస్తామని చెప్పారు. కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడంలేదు.

revanth

కాగా ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. ఒకానొక దశలో ఆయన బీజేపీలోకి వెళతారని, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆయన కొట్టివేశారు. గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలియవచ్చింది. మీడియాలో వార్తలు వచ్చిన మేపధ్యంలో విశ్వేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ క్యాంప్ కార్యాలయానికి పిలుపించుకుని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎన్నికల దృష్ట్యా రాజీనామా విషయాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని కోరారు. కేసీఆర్‌తో మాట్లాడి చెబుతానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే కేటీఆర్‌ ప్రయత్నాలు ఫలించలేదు. మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి పార్టీలో విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడాన్ని విశ్వేశ్వరరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

trs