Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శత్రుదేశాలు తప్ప… మిగిలిన దేశాల అధినేతలందరూ పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు మద్దతు తెలుపుతుంటారు. మిత్ర దేశాల అధినేతలైతే మరో అడుగు ముందుకేసి అన్ని విషయాలపై ఏకాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ విచిత్రంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రధాని థెరిసా మే ట్విట్టర్ లో మాటా మాటా అనుకోవడం తీవ్ర చర్చనీయాంశమయింది. రెండో ప్రపంచ యుద్ధం ముందుకాలం నుంచి అమెరికా, బ్రిటన్ మంచి మిత్రదేశాలు. అంతర్జాతీయ విషయాలకు సంబంధించి… ఆ రెండు దేశాలు ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాయి. ఆయా దేశాల విదేశంగా విధానం కూడా కాస్త దగ్గరగానే ఉంటుంది. ఇతర దేశాలతో అమెరికా వ్యవహార శైలిని ప్రపంచ దేశాలు కొన్ని తప్పుపడుతుంటాయి కానీ బ్రిటన్ మాత్రం ఎప్పుడూ మద్దతు ప్రకటిస్తుంటుంది.
2003లో ఇరాక్ యుద్ధం సమయంలో అంతర్జాతీయంగా అమెరికాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయినప్పటికీ… బ్రిటన్ మాత్రం అమెరికాకు అన్ని రకాలుగా అండదండగా నిలిచింది. అగ్రరాజ్యానికి మద్దతుగా తమ దేశ సైన్యాన్ని సైతం ఇరాక్ యుద్ధక్షేత్రానికి తరలించింది. అలాంటి మితృత్వం ఉన్న ఈ రెండు దేశాధినేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే…
ముస్లింలను వ్యతిరేకిస్తున్నట్టుగా, వారి చర్యలను విమర్శిస్తున్నట్టుగా ఉన్న మూడు వీడియోలను ట్రంప్ తన ట్విట్టర్ లో రీ ట్వీట్ చేశారు. వాటిలో ఓ వీడియోలో ముస్లిం వలసదారులు ఓ చిన్నారిని కొడుతుండగా… మరో వీడియోలో వర్జిన్ మేరీ విగ్రహాన్ని ముస్లిం మద్దతుదారులు ధ్వంసం చేస్తున్నారు. మూడో వీడియోలో ఓ టీనేజీ కుర్రాడని ముస్లిం యువత కొట్టిచంపుతున్నట్టుగా ఉంది. ఈ వీడియోలను ట్రంప్ రీట్వీట్ చేయడంపై థెరిసా విమర్శలు గుప్పించారు. అలాంటి వీడియోలను ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేసి వాటికి ప్రచారం కల్పించడం ఎంత మాత్రం సరికాదని థెరిసా అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన ట్రంప్ థెరిసా పై ప్రతి విమర్శలు చేశారు. తాను రీట్వీట్ చేసిన వీడియోలు ఓ బ్రిటన్ మహిళ పోస్టు చేసినవే అని, తనపై దృష్టిపెట్టడం మాని, యూకేలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఉగ్రవాదంపై ముందు దృష్టిపెట్టాలని, తాము బాగానే ఉన్నామని ట్వీట్ చేశారు.
The Muslims of Luton claim they’ve taken our country from us! It seems my Christian cross really offends them! pic.twitter.com/KJOpzXBqDN
— Jayda Fransen (@JaydaBF) March 16, 2017