టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ‘యూటర్న్’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంకు విడుదల కష్టాలు మొదలు అయ్యాయి. తెలుగులో సహజంగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు పెద్దగా మార్కెట్ ఉండదు. ఏదో భారీ చిత్రం అయితేనే డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారు. కాని ఈ చిత్రంను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు కరువయ్యారు. ఈ చిత్రం మొత్తంగా 11 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. తెలంగాణ మరియు ఆంధ్రాలో ఈ చిత్రం మొత్తంగా కూడా కలిపి 6 కోట్ల బిజినెస్ అవ్వడం లేదు. దాంతో నిర్మాతలు రిస్క్‌లో పడుతున్నారు. అందుకే సినిమా బిజినెస్‌ను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొన్ని ఏరియాల్లో ఈ చిత్రాన్ని అసలు కొనుగోలు చేసేందుకు కూడా డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదు. దాంతో ఈ చిత్ర నిర్మాతలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోబోతున్నారు. సినిమా కనీసం 8 కోట్ల బిజినెస్ అయితే తప్ప నిర్మాతలు ఒడ్డున పడే పరిస్థితి లేదు. ఇక ఈ చిత్రంకు సమంత ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. సమంత ఈ చిత్రం బిజినెస్‌కు సాయం చేయాల్సిందిగా, పబ్లిసిటీ కోసం హెల్ప్ చేయాల్సిందిగా మామ నాగార్జునను సంప్రదించినట్లుగా సమాచారం అందుతుంది. కోడలు మూవీ కోసం నాగార్జున రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. సస్పెన్స్ థ్ల్రిర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కష్టం. ఇలాంటి సినిమాను భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు వెనుకంజ వేస్తున్నారు. మరి ఈ కష్టం నుండి సమంత ‘యూటర్న్’ ఎలా తీసుకుంటుందో చూడాలి.