Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేనే రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు అన్న ముసుగు వేసుకుని సీఎం చంద్రబాబుని ఎలా ఇబ్బంది పెడదామా అని కాచుకు కూర్చునే మాజీ ఎంపీ ఉండవల్లి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. నంద్యాల ఫలితాన్ని వేరే విధంగా ఊహించుకున్న ఆయన మీడియాలో నానా రచ్చ చేయడానికి రెడీ అయిపోయారంట. ఒక్కో రౌండ్ ఫలితం చూసి అయ్యగారి మైండ్ బ్లాంక్ అయిపోయిందట. దాంతో సైలెంట్ గా ఉండిపోయారంట. పట్టిసీమ, పోలవరం, అమరావతి ఇలా ఏ అంశం తీసుకున్నా బాబుని ఇబ్బంది పెట్టడానికి ఉండవల్లి ఎంతో కసరత్తు చేస్తారు. నంద్యాల ఉప ఎన్నికల ఫలితం మీద కూడా అలాగే ప్రిపేర్ అయిన ఉండవల్లికి రిజల్ట్ చూసాక మాట పడిపోయినంత పని అయ్యిందట.
అటు మాజీ ఎంపీ సబ్బం హరి మాత్రం నంద్యాల ఫలితం తర్వాత గొంతు విప్పారు. ఈ ఫలితం చూసి అయినా జగన్ బుద్ధి మార్చుకోవాలని సూచించారు. భారీ అవినీతి ఆరోపణలు భుజాన మోస్తూ చంద్రబాబు మీద బురద చల్లడం వల్ల ప్రయోజనం ఏంటని సబ్బం ప్రశ్నించారు. బాగా ప్రిపేర్ అయ్యి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిన ఉండవల్లి, ఏ మాత్రం ప్రిపేర్ కాకుండా గొంతు విప్పిన సబ్బం మంచి మిత్రులు కావడం విశేషం.
మరిన్ని వార్తలు: