Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలోనే తొలిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఆయన్ను చూసి స్ఫూర్తి పొందే కేసీఆర్ కూడా తెలంగాణలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు నంద్యాల ఉపఎన్నికల తరుణంలో వైశ్య కార్పొరేషన్ తెరమీదకు వచ్చింది. త్వరలోనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటవుతుందని టీడీపీ ఊరిస్తోంది.
వైసీపీలో చేరిన సమయంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైశ్యుల్ని ఇంప్రెస్ చేసేలా మాట్లాడటంతో.. టీడీపీ అలర్టైంది. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చూస్తున్న బాబు.. అందుకు తగ్గట్లుగా గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని.. ఆ వర్గం ఓట్లన్నీ టీడీపీకి వేయించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
బాబు దూకుడు చూసి వైసీపీ కంగారెత్తిపోతోంది. జగన్ ఎంత ఘాటుగా విమర్శించినా.. బాబు చాపకింద నీరులా పనిచేస్తున్నారని, ఇలా చేస్తే ఎన్ని విమర్శలు చేసినా బూమరాంగ్ అవుతాయని చర్చ జరుగుతోంది. ఇప్పటికే శిల్పా చక్రపాణి రెడ్డి అఖిలప్రియపై చేసిన శ్రుతి మించిన విమర్శలు.. టీడీపీకి ప్లస్ అవుతాయని వైసీపీకి భయం పట్టుకుంది.
మరిన్ని వార్తలు: