నంది అవార్డులు.. వారికి ఆస్కార్‌ ఇవ్వాలన్న వర్మ

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై అందరు స్పందించారు కాని వర్మ స్పందించలేదేం అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో రానే వచ్చాడు, తనదైన శైలిలో స్పందించాడు. వర్మ పోస్ట్‌ తర్వాత నంది అవార్డుల గురించి మరింతగా చర్చ జరుగుతుంది. ఒక వర్గం వారికి నంది అవార్డు జ్యూరీ సభ్యులు అన్యాయం చేశారు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, వర్మ స్పందిస్తూ నంది అవార్డు జ్యూరీ సభ్యులకు ఆస్కార్‌ అవార్డును ఇవ్వాలి అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

'Nandi Awards Committee Deserves Oscar

 

వర్మ ఫేస్‌బుక్‌లో నంది అవార్డుల గురించి పెట్టిన పోస్ట్‌ ఇది..
నంది అవార్డు కమిటీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా…వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్ ..నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు..
ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖఛ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్ 🙏🙏🙏