Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Hero Varun Sandesh’s Wife Attempts Suicide News Is Real Or Fake
వరుణ్ సందేశ్ భార్య వితిక శేరు కుటుంబ కలహాల కారణంగా నిద్రమాత్రలు వేసుకుంది. ప్రస్తుతం ఆమె అపోలో హాస్పిటల్లో చిక్సి పొందుతుంది అంటూ రెండు రోజులుగా మీడియాలో తెగ ప్రచారం జరిగిన విషయం తెల్సిందే. ఆ ప్రచారంలో నిజం లేదని, తాను సంతోషంగా ఉన్నాను, తన భర్తతో హాయిగా జీవితాన్ని సాగిస్తున్నాను, మీడియాలో వస్తున్న వార్తలు తన సన్నిహితులు పట్టించుకోనక్కర్లేదు అంటూ ట్విట్టర్ ద్వారా వితిక శేరు క్లారిటీ ఇచ్చింది. దాంతో మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.
నిప్పులేనిదే పొగరాదు, మరి ఎలా వితిక ఆత్మహత్య చేసుకోబోయింది, ఆమె హాస్పిటల్లో ఉంది అంటూ ఫొటోలు వచ్చాయి అనేది ఇప్పుడు అందరి ప్రశ్న. ఆ ప్రశ్నకు కూడా వితిక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. చాలా రోజుల క్రితం నిద్ర రావడంలేదని నిద్ర మాత్రలు వేసుకున్నాను. అది కాస్త మోతాదు మించింది. దాంతో హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలోనే నన్ను పరామర్శించేందుకు వచ్చిన స్నేహితులు ఫొటో తీశారు. అది సోషల్ మీడియాలో అప్పట్లో పెట్టారు. దాన్ని ఇప్పుడు తీసుకు వచ్చి ఇలా ప్రచారం చేశారు అంటూ చెప్పుకొచ్చింది. ఈమె చెప్పేదాంట్లో నిజం ఉంది అనిపించడం లేదని కొందరు అంటే, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏంటని కొందరు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది వారిద్దరితో పాటు ఆ దేవుడికే తెలియాలి.
మరిన్ని వార్తలు