మళ్లీ ప్రకటించారు ఎందుకో?

Varun Tej New Movie Fidaa Releasing on July 21st

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Varun Tej New Movie Fidaa Releasing on July 21st

మెగా హీరో వరుణ్‌ తేజ్‌, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే తాజాగా రీ షూట్‌ అంటూ వార్తలు రావడంతో విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని అంతా భావించారు. ఆ వాదనను కొట్టి పారేయాలనే ఉద్దేశ్యంతో మరోసారి చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా మీడియాకు ఈనెల 21న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా ప్రెస్‌నోట్‌ను పంపడం జరిగింది. 

మీడియాలో వస్తున్న రీ షూట్‌ వార్తలు నిజమే అయినప్పటికి కేవలం వారం రోజుల్లోనే ఆ రీ షూట్‌ కార్యక్రమాలు పూర్తి చేసి వెంటనే సినిమాకు సంబంధించిన ఇతర కార్యక్రమాలను పూర్తి చేసి అనుకున్నతేదీని విడుదల చేసేలా దిల్‌రాజు ప్లాన్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్‌ కమ్ముల చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన నటీనటులతో రీ షూట్‌ను చేస్తూనే ఉన్నాడు. అన్ని పనులు చకచక జరిగి పోతున్నాయి కను ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఆగేదే లేదని దిల్‌రాజు ఆపీస్‌ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే సినిమాపై ఆసక్తి పెరిగింది. దిల్‌రాజు ఎడిటింగ్‌లు చేయిస్తుండటంతో తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందని మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

మరిన్ని వార్తలు:

ఎన్టీఆర్ ప్రొడ్యూసర్ చిరు నిర్మాతకి హ్యాండ్?

నాని ఓవర్‌ కాన్ఫిడెన్స్