Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వెంకయ్య నాయుడు పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఆయన గురువు అద్వానీ లాగే ఉంది. అద్వానీని మోడీ పక్కనపెట్టినప్పుడు ఏం చేయలేకపోయిన వెంకయ్య.. ఇప్పుడు తనను సైడ్ చేసినా నిస్సహాయంగా చూస్తుండిపోతున్నారు. ఉపరాష్ట్రపతి పదవి ఇష్టం లేకపోయినా.. అదో ప్రమోషన్ గా భావిస్తూ ఆత్మ సంతృప్తి చెందుతున్నారు.
ఏపీలో పాలిటిక్స్ కోసమే అమిత్ షా వ్యూహాత్మకంగా వెంకయ్యను పక్కనపెట్టారన్న వాదన నిజమే అయినా.. ఇప్పుడు వెంకయ్య కూడా తన మనోవేదనను మరోసారి వ్యక్తం చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. రేపు రాజ్యసభ ఛైర్మన్ గా సభను నడిపించాల్సిన వెంకయ్య ఈ అసంతృప్తితో అక్కడేమైనా తేడా చేస్తారేమోనని మోడీ వీర భక్తులకు డౌట్ వచ్చింది.
కానీ వెంకయ్య వ్యక్తులకు కాదు పార్టీకి విధేయుడు కాబట్టి.. చచ్చినట్లు పనిచేస్తారన్నది మోడీ, షా వ్యూహం. ఈ ఇద్దరి దెబ్బకు వెంకయ్యకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినంత పనైంది. ఏదో ఆత్మీయుల దగ్గర గోడు చెప్పుకోవడమే కానీ.. ఆయన చెబితే వినేవారెవరు.
మరిన్ని వార్తలు:
ఐటీకి ఒక రూల్.. టాలీవుడ్ కు మరో రూల్
ఏపీ సంగతి కేసీఆర్ కు ఎందుకు..?
ఏపీ పీఏసీలో అనుకోని పరిణామం