Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమ్మక్క, సారలమ్మ జాతరకు సామాన్యులతో పాటు వీఐపీలు, వీవీఐపీలు తరలివస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన వెంకయ్య అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో జాతర వద్దకు చేరుకున్నారు. తలపై బంగారాన్ని మోసుకుంటూ వచ్చిన వెంకయ్య… నిలవెత్తు బంగారాన్ని తులాభారం ద్వారా అమ్మవార్లకు సమర్పించారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా మేడారంలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వెంకయ్యనాయుడుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్వాగతం పలికారు. ఇక్కడకు రావడం తనకెంతో సంతోషం కలిగించిదని వెంకయ్య అన్నారు. సమ్మక్క, సారలమ్మ జాతరను ఆదివాసీ, గిరిజన కుంభమేళాగా ఆయన అభివర్ణించారు. అటు వనదేవతల దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తుండడంతో మేడారం భక్తజనసంద్రమయింది.