Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ఎంపికతో అందరికీ షాకిచ్చిన బీజేపీ… రాష్ట్రపతి అభ్యర్థిగా కూడా రామ్ నాథ్ కోవింద్ సెలక్షన్ వెనుక ఎంతో రాజకీయ పరిణతి ప్రదర్శించింది. కోవింద్ పేరు వినగానే… ఎవ్వరూ నో అనలేని పరిస్థితి కల్పించింది. అయినా పేరుకు విపక్షాలు మీరాకుమార్ ను బరిలోకి దించినా… కోవింద్ గెలుపు లాంఛనమేనన్నది బహిరంగ రహస్యమే.
రాష్ట్రపతిగా తమ అభ్యర్థి గెలుపు ఖాయం కావడంతో… ఉపరాష్ట్రపతి ఎన్నికలపై దృష్టి సారించింది బీజేపీ. రాష్ట్రపతిగా ఉత్తరాది దళితుడు ఉంటాడు కాబట్టి… ఉపరాష్ట్రపతి దక్షిణాది అగ్రవర్ణ నేతే ఉండాలన్నది అమిత్ షా గేమ్ ప్లాన్. అదే నిజమైతే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రేసులో ముందుంటారనేది బీజేపీ వర్గాల మాట. కానీ సమర్థుల్ని క్యాబినెట్ లో నుంచి తప్పించేందుకు మోడీ ఇష్టపడటం లేదు. మరి ఎవర్ని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరమే.
దక్షిణాదిలో బీజేపీకి ఉన్న ఏకైక అగ్రనేత వెంకయ్య. ఆయన తర్వాత కూడా అగ్రనేతలు ఉన్నా… వారు దేశవ్యాప్తంగా పేరున్నవారు కాదు. అందరూ గుర్తుపట్టగలిగే వారు కాదు. అందుకే వెంకయ్యే బెస్ట్ చాయిస్ అనే మాట వినిపిస్తోంది. కానీ మోడీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఉపరాష్ట్రపతి పదవికి కూడా అనూహ్య అభ్యర్థి రేసులోకి వస్తారని, మరోసారి దేశానికి షాక్ తప్పదంటున్నారు మోడీ సన్నిహితులు.
మరిన్నివార్తలు
బీజేపీ కత్తికి రెండు వైపులా పదునే
కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు
రజనీ గాలి తీసేసిన సర్వే