Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బీజేపీలో నేతల్ని వెంకయ్య ఎదగనివ్వలేదు. ఇదీ వెంకయ్యపై ఏఫీలో ఉన్న కంప్లైంట్. కానీ ఇందులో నిజం మాత్రం లేదంటారు చాలా మంది. వెంకయ్య తరహాలో పదవులకు అతీతంగా కష్టపడిన నేత.. ఒక్క ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా బీజేపీలో ఎవరూ లేరు. అలాంటిది వెంకయ్య ఎదగనిచ్చేదేంటని చాలా మంది అనుకోవచ్చు. కానీ బీజేపీ అధిష్ఠానం మాత్రం మొదటి స్టేట్ మెంటే నిజమని నమ్ముతోంది. వెంకయ్యను క్రియాశీలం నుంచి తప్పిస్తే.. ఏపీ బీజేపీ ఎదుగుతుందని అమిత్ షా కు ఎవరో సలహా ఇచ్చారు. ఆయన ఆచరణలో పెట్టేశారు.
కానీ ఏపీలో బీజేపీకి ఎంత సీనుందో పిల్లాడ్ని అడిగినా చెబుతాడు. అసలు బీజేపీకి సొంతంగా ఒక్క సీటు కూడా సంపాదించుకునే బలం లేదు. అలాంటి పార్టీ వెంకయ్య ఉన్నా ఎదగలేదు. వెంకయ్య లేకున్నా అడ్వాంటేజ్ తీసుకోలేదు. అలాంటప్పుడు ఇంత కసరత్తు ఎందుకుంటే.. ఏదో జరిగిపోతుందనే షో చేయడం కోసం అనుకోవాలి. ఇక జగన్ తో బీజేపీ జతకట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే నీతిమంతుడ్నని చెప్పుకునే మోడీ జగన్ తో కలిస్తే ఇబ్బందిపడతారు. కానీ బాబుతో ఆ ప్రాబ్లమ్ లేదు. పైగా జగన్ సీఎం అయ్యాక కూడా ఇంత వినయంగా ఉంటారా అనేది డౌటే.
ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ తో తలబొప్పికట్టించుకున్న కమలం.. మళ్లీ అలాంటి పని చేస్తుందా అనేది అనుమానమే. బెదిరించినా, బతిమాలినా బాబే బెటరని ఆర్ఎస్సెస్ కూడా ఇప్పటికే ఓ రిపోర్టు ఇచ్చిందట. జగన్ కు క్రైస్తవులు, దళితుల అండ ఉందని, బీజేపీతో కలిస్తే.. ఆయనకే నష్టమని, బీజేపీకి కూడా ఒరిగేదేమీ లేదనేది గ్రౌండ్ టాక్. అమిత్ షా ఇప్పటికైనా తన అతి విశ్వాసాన్ని వదిలేసి.. నిజాన్ని గ్రహించగలిగితే బీజేపీకి మేలు కలుగుతుంది. లేకపోతే కమలం పార్టీకి ఊహించని భంగపాటు తప్పదు.
మరిన్ని వార్తలు: