Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతురావుపై విమర్శలు చేయటం సోషల్ మీడియాలో వైరలయింది. అసభ్యంగా ఉందంటూ…ఓ సిటీ బస్సుపై ఉన్న అర్జున్‌రెడ్డి పోస్టర్ ను వీహెచ్ చించివేసిన సంగతి తెలిసిందే…దీనిపై రాంగోపాల్ వర్మ విహెచ్ ను విమర్శించారు. వారిద్దరి మధ్య అర్జున్ రెడ్డికోసం మాటల యుద్ధం కూడా నడిచింది. సినిమా రిలీజ్ తర్వాత సెన్సేషనల్ హిట్ టాక్ రావటంతో అందరూ అర్జున్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కూడా అర్జున్‌రెడ్డి బాగుందని పొగిడారు. దీనిపై స్పందించిన వీహెచ్ కేటీఆర్ విజయ్ కు బంధువవుతాడని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లపై విజయ్ తన ఫేస్బుక్ లో స్పందించాడు.
డియర్ తాతయ్య అని వీహెచ్ ను సంబోధించిన విజయ్ వ్యంగ్యంగా కొన్ని కామెంట్లు చేశాడు. అర్జున్ రెడ్డి బాగుందన్న కేటీఆర్ తనకు బంధువయినప్పుడు సినిమాను ప్రశంసించిన ఎస్. ఎస్. రాజమౌళి తనకు తండ్రి అవుతాడని, దగ్గుబాటి రానా, వరుణ్ తేజ, నాని, శర్వానంద్ లు సోదరులవుతారని వ్యాఖ్యానించాడు. తనకు అక్కాచెల్లెళ్లు లేరని కాబట్టి ఆ ఫీలింగ్ తెలియదని, సమంత, అను ఇమ్మానుయేల్, మెహరీన్ తన మరదళ్లు అని,ఐదురోజుల్లో సినిమాను సూపర్ హిట్ చేసిన విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ తనకు కవలలని చెప్పుకొచ్చాడు. ఇంతటిటో ఆగకుండా…సినిమాను ప్రశంసిస్తున్న రాంగోపాల్ వర్మ మన ఇద్దరిలో ఎవరికి తండ్రో క్లారిటీ లేదంటూ…తాతయ్యా చిల్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు విజయ్. సినిమా రిలీజ్ కుముందు కూడా ఇలాగే మాట్లాడిన విజయ్ పై అనేకమంది విమర్శలు కురిపించారు. వాటితో వెనక్కి తగ్గిన విజయ్ సినిమా హిట్టవ్వటంతో ఇప్పుడు మళ్లీ నోటికి పనిచెప్తున్నాడు. అటు ఇప్పటిదాకా ఫేస్ బుక్ ఖాతానే మెయిన్ టెయిన్ చేసిన విజయ్ ఇప్పుడు ట్విట్టర్ లోనూ ఖాతా తెరిచాడు. ఫేస్బుక్ ఎకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ప్రారంభించానని, తనకు ట్వీట్ చేయండని విజయ్ కోరాడు.
మరిన్ని వార్తలు: