విజయ్ దేవరకొండ ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన ‘నోటా’ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. కాని ఆ చిత్రం అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. విజయ్ దేవరకొండ స్వయంగా తన సినిమా ఫ్లాప్ అంటూ ఒప్పుకున్నాడు. తదుపరి చిత్రం విషయంలో మళ్లీ అలా తప్పు జరగనివ్వను అంటూ హామీ ఇచ్చాడు. మరో వైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రెడ్’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నిన్న మొన్నటి వరకు అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. కాని నోటా ఫలితంతో డియర్ కామ్రెడ్ ఎలా ఉంటుందో అనే అనుమానాలు మొదలయ్యాయి.
‘డియర్ కామ్రెడ్’ చిత్రం షూటింగ్ చకచక జరుగుతుంది. కాని ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదు. దాంతో ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే తగ్గించాలని నిర్ణయించుకున్నారు. గీత గోవిందం తర్వాత డియర్ కామ్రెడ్ చిత్రం బడ్జెట్‌ను భారీగా అనుకున్నారు. కాని నోటా ఫలితంతో అంతగా వద్దని భావిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం బడ్జెట్ విషయంలో మార్పులు చేర్పులు చేశారంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఫ్లాప్ అయినా పెద్దగా ఫరక్ పడకుండా బడ్జెట్‌ను ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. వచ్చే ఏడాది ఆరంభంలో విజయ్ దేవరకొండ కామ్రెడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.