టాలీవుడ్ యంగ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువ దర్శకుడు పరశురామ్ పెట్ల తో చేస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా లో సీతారామం, హాయ్ నాన్న మూవీ ల ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా లో ఫస్ట్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. వాస్తవానికి ఈ సినిమా ని ఇటీవల సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించిన మేకర్స్, షూట్ ఆలస్యం కారణంగా రిలీజ్ ను కొన్నాళ్ళు వాయిదా వేశారు. ఇక నేడు తమ సినిమా యొక్క న్యూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు ఫ్యామిలీ స్టార్ మేకర్స్. కాగా ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నది . తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.