Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోపూ ఈ ఏడాది అత్యంత హాట్ టాపిక్ గా నిలిచిన విషయం ఏదంటే అందరూ ఠక్కున చెప్పే సమాధానం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పెళ్లి అని. శ్రీలంకతో స్వదేశంలో జరిగే వన్డే, టీ20 సిరీస్ నుంచి తనకు విశ్రాంతి కావాలని కోహ్లీ కోరినప్పటినుంచే విరుష్క పెళ్లిపై చర్చమొదలయింది. ఎప్పుడూ ఫిట్ నెస్ తో ఉండే విరాట్ విశ్రాంతి కోరడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ముగియగానే వారి పెళ్లివార్తలు షికార్లు చేశాయి. వారిద్దరూ ఇటలీలో పెళ్లిచేసుకోబోతున్నారంటూ మీడియో హోరెత్తింది.
అయితే అనుష్క శర్మ అధికారిక ప్రతినిధి ఆ వార్తలు ఖంచించి అందరినీ అయోమయంలో పడేశారు. ఆ తర్వాతిరోజే అనుష్క కుటుంబ సభ్యులతో కలిసి ఇటలీ వెళ్తూ మీడియా కంటికి చిక్కడంతో ఇక పెళ్లి ఖాయమేఅని అంతా అనుకున్నారు. పెళ్లి డిసెంబరు 12న జరగనుందన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి. ఢిల్లీ, ముంబై రిసెప్షన్ తేదీలు కూడా బయటికి వచ్చినప్పటికీ అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఈ ఊహాగానాలు ఇలా సాగుతుండగానే డిసెంబరు 11న అనుష్క శర్మ తమ పెళ్లిఫొటోను పోస్ట్ చేసి తాము వివాహంచేసుకున్నామని ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఆ ట్వీటే ఇప్పుడు గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది ఈ మేరకు ట్విట్టర్ ఇండియా ఓ ప్రకటన చేసింది.
అలాగే ట్విట్టర్ లో భారతీయులు ఆసక్తులకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ గురించి ఎక్కువమంది తమ ట్వీట్లలో ప్రస్తావించారని తెలిపింది. షారూఖ్ తర్వాతి స్థానంలో అమితాబ్ బచ్చన్, ఏ ఆర్ రెహ్మాన్, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ లు నిలిచారు. హీరోయిన్ల విషయానికొస్తే దీపికా పదుకునే గురించి ఎక్కువమంది ప్రస్తావించారు. ఆమె తర్వాతి స్థానాల్లో అలియా భట్, ప్రియాంక చోప్రా, శ్రద్ధా కపూర్, భూమీ ఫడ్నేకర్ లు ఉన్నారు. సినిమాల విషయానికొస్తే షారూఖ్ ఖాన్ రాయిస్, సల్మాన్ ఖాన్ టైగర్ జిందాహై, ట్యూబ్ లైట్, అక్షయ్ కుమార్ టాయిలెట్..ఏక్ ప్రేమ్ కథా చిత్రాలు నిలిచాయి.