తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో కమల్ హాసన్. ఈయన తెలుగులో కూడా స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. కమల్ హాసన్ నటించే ప్రతి సినిమా కూడా డైరెక్ట్ తెలుగు సినిమా అన్న రీతిలో విడుదల అవుతూ ఉంటుంది. అందుకే కమల్ హాసన్నకు యూనివర్శిల్ స్టార్ అంటూ గుర్తింపు దక్కింది. కమల్ హాసన్ గత కొంత కాలంగా సినీ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి. ఒప్పుడు కమల్ సినిమాలకు భారీగా పోటీ ఉండేది. అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడి మరీ కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చేవారు. కాని ‘విశ్వరూపం 2’ చిత్రానికి మాత్రం బిజినెస్ కాక కమల్ చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది.
‘విశ్వరూపం 2’ చిత్రం ఆరు సంవత్సరాలుగా వాయిదాలు పడుతూ వచ్చి ఎట్టకేలకు పూర్తి అయ్యింది. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని మద్యలో వదిలేయడంతో ఈమద్య కమల్ హాసన్ చేతుల్లోకి తీసుకుని సినిమాను పూర్తి చేశాడు. దాదాపు ఆరు సంవత్సరాలుగా ఈ చిత్రం గురించి మీడియాలో ప్రచారం జరుగుతుంది. దాంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గి పోయింది. దానికి తోడు కమల్ గత చిత్రాలు కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. దాంతో ఈ చిత్రం కూడా అదే దారిలో ఉంటుందని అంతా భావిస్తున్నారు. కనుక తమిళనాట మరియు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపడం లేదు. దాంతో తక్కువ ధరకు అమ్మడం ఇష్టం లేని కమల్ హాసన్ ఏదైతే అదే జరుగుతుందని స్వయంగా రంగంలోకి దిగి సొంతంగా విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రం కమల్ హాసన్‌కు ఆర్థికంగా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.