Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ కింద పడ్డప్పుడల్లా పైకి లేపడానికి ముందుకు వస్తున్న నాయకుడు, మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్. వైసీపీ లో చేరి ఆయన ఈ పని చేస్తే ఈ విషయంలో ఎవరికీ ఏ అభ్యంతరం వుండే అవకాశం లేదు. కానీ తనకు ఏ పార్టీ తో సంబంధం లేదని చెబుతూ కలరింగ్ ఇస్తూ చంద్రబాబుని టార్గెట్ చేయడానికి, జగన్ ని పైకి లేపడానికి నానా పాట్లు పడుతుంటారు ఉండవల్లి. అక్కడే అసలు సమస్య వస్తోంది. తాను అంపైరింగ్ చేస్తున్నట్టు చెబుతూ ఓ టీం కి కొమ్ము కాయడం జనానికి ఎప్పుడో అర్ధం అయిపోయింది.
కానీ ఈ విషయం అర్ధం చేసుకోకుండా ఇంకా మేధావి ముసుగులో రాజకీయ లక్ష్యాల కోసం ఉండవల్లి తెగ ట్రై చేసేస్తున్నారు. నంద్యాల,కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా డీలా పడ్డ వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఉండవల్లి మరోసారి ప్రెస్ ముందుకు వచ్చారు. ఉప ఎన్నికల్లో అధికార పక్షం గెలవడం పెద్ద గొప్పేమీ కాదని సెలవిచ్చారు. 2012 లో టీడీపీ పరిస్థితిని గుర్తుకు తెచ్చి వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపడానికి ట్రై చేసిన ఉండవల్లి తన లక్ష్యానికి భంగం కలిగేట్టు ఓ తప్పు చేసేసారు. అదే …జగన్ దగ్గర బ్లాక్ మనీ లేదని చెప్పడం. జగన్ దగ్గర మొత్తం వైట్ మనీ ఉందని,అది కూడా ఎక్కువ భాగం సీజ్ చేసి ఉందని చెప్పారు.
అయితే జగన్ దగ్గర బ్లాక్ మనీ లేదని చెప్పడం ద్వారా వైసీపీ శ్రేణుల్లో కొత్త భయం పుట్టుకొచ్చింది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా జగన్ అధికారంలోకి వస్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీ శ్రేణులకు ఉండవల్లి మాటలు మింగుడు పడడం లేదు. జగన్ ఇమేజ్ అంతకంతకు పడిపోతోంది.ఇక డబ్బు కూడా లేదన్న ప్రచారం జోరుగా సాగితే ఏ నాయకుడు ఇక పార్టీ వైపు చూస్తాడన్న భయం వారిది. అందుకనే ఉండవల్లి గారు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఎంత ట్రై చేసినా జగన్ ఏమీ మహాత్ముడు అని జనం అనుకోరు.
మరిన్ని వార్తలు: