ఇదిగో అదిగో అంటూ కొన్ని నెలలుగా ఊరిస్తున్నారే తప్ప.. ఇంతవరకు కమలం పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చింది లేదు. అయితే త్వరలోనే కొత్త బాస్ వస్తారంటూ పార్టీ సంకేతాలు ఇస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణతో పాటు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేరు షార్ట్ లిస్ట్ అయినట్టు తెలుస్తోంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. వీళ్లలో ఎవరిని నియమిస్తే కమల వికాసం సాధ్యమవుతుందని.. హైకమాండ్ తీవ్ర సమాలోచనలు చేస్తుందట.