ప్రకాష్‌ రాజ్‌, అనుపమల మద్య డిష్యూం డిష్యూం..!

Words of War Between Prakash Raj and Anupama Parameswaran

సినిమా చిత్రీకరణ సమయంలో ఇద్దరు నటీనటులు లేదా క్రియేటివ్‌ టీం మద్య చిన్న వాదోపవాదాలు జరగడం చాలా సహజం. అయితే అవన్ని కూడా మీడియా ముందుకు రాకుండానే సమసి పోతాయి. అయితే కొన్ని మాత్రం మీడియా ముందుకు రావడంతో రచ్చ రచ్చ అవుతుంది. తాజాగా రామ్‌ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రం షూటింగ్‌ సమయంలో హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మరియు ప్రకాష్‌ రాజ్‌ల మద్య చిన్న వివాదం జరిగినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అనధికారిక సమాచారం అందుతుంది. ఇప్పటికే వీరిద్దరు షూటింగ్‌లో గొడవపడి రెండు రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

షూటింగ్‌ సమయంలో వీరిద్దరి గొడవ పూర్తి వివరాల్లోకి వెళ్తే… దర్శకుడు ఒక సీన్‌ను ప్రకాష్‌ రాజ్‌ మరియు అనుపమల కాంబోలో తెరకెక్కించే ప్లాన్‌ చేస్తున్నాడు. వీరిద్దరు సినిమాలో తండ్రి కూతురుగా కనిపించబోతున్నారు. దర్శకుడు సీన్‌ వివరించగా అనుపమ అందుకు సిద్దం అయ్యింది. అయితే ప్రకాష్‌ రాజ్‌ సీన్‌ను కాస్త మార్చడంతో అనుపమ కన్ఫ్యూజ్‌ అయ్యింది. దాంతో ప్రకాష్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సీన్‌ను మద్యలో మార్చితే ఎలా అంటూ తప్పుపట్టింది. ఆ సమయంలోనే తెలియకుండా అడిగి తెలుసుకో అంటూ సూచించాడు. దర్శకుడు కాని మీరు నాలాగే ఒక ఆర్టిస్టు మాత్రమే, మీ నుండి నేను అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిందట. అందుకు ప్రకాష్‌ రాజ్‌ ఏదో అనడం, ఆ తర్వాత అనుపమ ఏడ్చి పక్కకు వెళ్లడం జరిగిందట. వీరిద్దరి మద్య వివాదంకు దర్శకుడు త్రినాధరావు నక్కిన ఫుల్‌స్టాప్‌ పెట్టి మళ్లీ షూటింగ్‌ చేస్తున్నాడు. మొత్తానికి అనుపమ కాస్త అతిగా ప్రవర్తించిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.