నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణన ఘటన చోటుచేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే జ్యోతి హాస్పటల్ మెయిన్ గెట్ ముందు వినోభానగర్ కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా కత్తితో నరికి చంపారు. 6 నెలల కిందే ప్రణయ్‌కు అమృత అనే యువతితో ప్రేమవివాహం జరిగింది. అమె గర్భవతి కావడంతో స్థానిక గైనకాలజిస్టు దగ్గర చెక్‌అప్ కోసం శుక్రవారం తీసుకువచ్చాడు. అయితే భార్యను డాక్టర్‌కు చూపించిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఓ వ్యక్తి వెనకవైపు నుంచి వచ్చి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది.
అమృత పట్టణానికే చెందిన మారుతీ రావు( రియల్ ఎస్టేట్ వ్యాపారి) కుమార్తె, ఆమెను ప్రణయ్ వివాహం చేసుకోవడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో, వారిద్దరూ ఆరు నెలల కిందట లేచిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవలే రిసెప్షన్ కూడా గ్రాండ్‌గా జరిపారు. ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్తితి సమీక్షిస్తున్నారు. ప్రణయ్‌పై కత్తితో దాడి చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.