Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. అక్కడ హీట్ పెంచడానికి వైసీపీ అధినేత జగన్ తన వంతు ప్రయత్నం చేస్తూ వున్నారు. ఏకంగా సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ కాల్చేసినా తప్పు లేదని ఓ సారి, ఉరి శిక్ష వేయాలని ఇంకోసారి అనడం ద్వారా జగన్ కి ఈ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో అర్ధం అయ్యింది. ఏమి చేసి అయినా, ఏమి మాట్లాడినా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఎంత చిన్న అస్త్రం దొరికినా దాన్ని పదును చేసి మరీ ప్రయోగించడానికి సిద్ధంగా వున్నారు. అలాంటి జగన్ ఓ పెద్ద అస్త్రాన్ని ఏమీ పట్టనట్టు వదిలెయ్యడం నంద్యాల ఓటర్లని ఆలోచింపచేస్తోంది.
నంద్యాల ఉపఎన్నికలు అనుకోగానే వైసీపీ శ్రేణులన్నీ ప్రత్యేక హోదా అంశమే ఈ ఎన్నికల్లో హైలైట్ అవుతుంది అనుకున్నారు. అప్పట్లో జగన్ సైతం ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీ లు రాజీనామా చేస్తారని చెప్పారు. కానీ అనుకున్నదొక్కటి…అయినది ఒక్కటి. నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఇప్పటిదాకా ఏపీ కి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇంత పెద్ద అస్త్రాన్ని జగన్ ఎందుకు వదిలి పెట్టారో ఆయనకు మాత్రమే తెలుసు అని ఆయన అనుకుంటున్నారు. ఎప్పుడైతే హోదా ప్రస్తావన వస్తుందో జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తిట్టాలి. అదే చేస్తే మోడీ సర్కార్ కి ఈడీ కేసులు అస్త్రంగా దొరికిపోతాయని తెలుసు. ఆ భయం తోటే జగన్ నోరు తెరవడం లేదని నంద్యాల ప్రజలకు బాగా అర్ధం అయ్యింది. పైగా 50 మైనారిటీ ఓట్లు ఉన్నప్పటికీ బీజేపీ గురించి విమర్శ చేయడానికి జగన్ భయపడడం చూసి ముస్లిం వర్గం ఆశ్చర్యపోతోంది. మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకునే జగన్ ఇంత పిరికివాడా అని నంద్యాల ప్రజలు చర్చించుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: