Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రశాంత్ కిషోర్ ని వ్యూహకర్తగా నియమించుకుంది వైసీపీ. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఎవరికీ ఎప్పుడూ ఇవ్వనంత గౌరవమర్యాదలు ఆయనకి ఇచ్చారు అధినేత జగన్. అదే ఇప్పుడు ఆ పార్టీ నాయకులకి పెద్ద సమస్య అయ్యి కూర్చుంది. జగన్ ఇస్తున్న గౌరవం, ప్రాధాన్యత నిజానికి ప్రశాంత్ లోని కొత్తమనిషిని బయటకు తెచ్చాయి. ఇంతకుముందు కూడా ఆయన ఎంతో మందికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు. అయితే ఎన్నడూ ఇంతగా ఎక్స్ పోజ్ అయ్యింది లేదు. ఆయన బయటికి రాలేదు అనే కన్నా ఆయా పార్టీలు ఆయన్ని కేవలం వ్యూహకర్తగానే పరిగణించాయి. అందుకు తగ్గట్టే ఆయన ఇచ్చిన సలహాల్లో నచ్చినవి తీసుకున్నాయి, లేదంటే పక్కన పెట్టాయి. కానీ ప్రశాంత్ దగ్గర ఏదో మంత్రదండం ఉన్నంత నమ్మకం పెట్టుకున్న జగన్ ఆయనకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం తో సీన్ మారిపోయింది.
ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ ఇస్తున్న ప్రాధాన్యంతో తాను మంత్రి కాదు రాజు అనుకోసాగారు. ఇంకేముంది… జరగాల్సిన తప్పులన్నీ జరిగిపోతున్నాయి. ఓ వ్యూహకర్తగా ప్రశాంత్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో జగన్ దగ్గరికి వెళ్లడం, ఆయన సరే అనగానే ఒక్క విజయసాయిరెడ్డి తప్ప ఇంకెవ్వరితో చెప్పకుండా నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఆ స్పీడ్ లోనే ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లతో మాట మాత్రం చెప్పకుండా వారి వారి ప్రాంతాలకు సర్వే టీం లని పంపిస్తున్నారు. ద్వితీయ స్థాయి నేతలతో ఎమ్మెల్యే పని తీరు గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యేకి సన్నిహితంగా వుండే వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు సంబరపడుతున్నారు. దీంతో నియోజకవర్గ స్థాయిలో పీకే టీం కొత్త చిచ్చు రగిలిస్తోంది. ఒక్కో సందర్భంలో ప్రశాంత్ స్వయంగా తమని కూడా తక్కువ చేసి మాట్లాడడం ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్లంతా నంద్యాల ఉపఎన్నిక తర్వాత జగన్ వద్ద ప్రశాంత్ మీద ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారంట.
మరిన్ని వార్తలు: