Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముద్రగడ పద్మనాభం ని ముందుంచి కాపు రిజర్వేషన్ ఉద్యమం నడిపించడంలో వైసీపీ పాత్ర బహిరంగ రహస్యమే. ఈసారి ఎన్నికల్లో కాపుల ఓట్లు లేకుండా గెలుపు అసాధ్యమని వైసీపీ భావిస్తోంది. అందుకే కాపు రిజర్వేషన్ అంశం ఆయుధంగా పదేపదే టీడీపీ సర్కార్ మీద ఒత్తిడి పెంచుతోంది. కాపు రిజర్వేషన్ ఉద్యమంలో తాము ఛాంపియన్ ని నిరూపించుకునేందుకు సాక్షిలో ముద్రగడకి భారీ కవరేజ్ ఇస్తోంది. ఇదంతా చూసి రాజకీయ అవసరాల కోసం వైసీపీ కాపుల్ని నెత్తికి ఎత్తుకుంటోంది అని అనుకుంటే మాత్రం బొక్కబోర్లా పడ్డట్టే. తాజాగా విజయవాడలో వంగవీటి రాధకి ఎదురైన అనుభవం వైసీపీ ప్రాధాన్యాల్ని కళ్ళకు కట్టింది.
వైసీపీ అధినేత జగన్ కుటుంబంతో దూరపు బంధుత్వం వున్న నేత ఇటీవల వైసీపీ నుంచి బహిష్కరణ కి గురైన గౌతమ్ రెడ్డి. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో దివంగత వంగవీటి రంగా మీద చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాని వల్ల కాపుల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు అప్పటికప్పుడు గౌతమ్ రెడ్డి మీద చర్యలు తీసుకున్నారు. ఆ ఎపిసోడ్ అంతటితో అయిపోలేదు. పార్టీలో లేకపోయినా ఆయన అనుచరులకు పార్టీ కీలక పదవులు దక్కుతున్నాయి. దీంతో వంగవీటి రాధకి సీన్ అర్ధం అయిపోయింది. వాళ్ళు వీళ్ళు ఎందుకులే అని నేరుగా జగన్ దగ్గరే ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజల్లో పలుకుబడి వుంది కాబట్టే వారికి పదవులు ఇచ్చాం అని చెప్పడంతో రాధా షాక్ తిన్నారట. తాను పార్టీలో వున్నా, గౌతమ్ రెడ్డి మీద పార్టీ వేటు వేసినా అతని మాటే వైసీపీ లో చెల్లుతుందని అర్ధం చేసుకున్న వంగవీటి తీవ్ర మనోవేదనతో ఉన్నారట. ఆయన రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. రాధా బాధ ఎలా వున్నా కృష్ణా జిల్లాలో సైతం పార్టీలో వున్న కాపుని కాదని బహిష్కరణకు గురి అయిన రెడ్డి గారి మాట వింటే ఏమి రాజకీయం చేస్తారో ఏంటో ?