Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజు గారి పెద్ద భార్య మంచిది అంటే ఆటోమేటిక్ గా చిన్న భార్యకి మండిపోతుంది. శుభమా అంటూ పాదయాత్ర కి ముందు మీడియా సాయం కోరిన జగన్ ఆ ఎపిసోడ్ లో పెద్ద తప్పే చేశారు. ఫిలిం సిటీ వెళ్లి మరీ ఈనాడు చైర్మన్ రామోజీని కలిసిన జగన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ దగ్గరికి వెళ్ళలేదు సరికదా ఆయన్ని కనీసం పిలవకుండా హర్ట్ చేశారు. ఇక మిగిలిన మీడియా ముఖ్యులతో పాటు పిలిచి టీవీ 9 రవిప్రకాష్ ని హర్ట్ చేశారు జగన్. ఒక అతన్ని అసలు పిలవకుండా, ఇంకొకరిని అందరితో ఒకే గాటన కట్టి జగన్ పెద్ద తప్పే చేసారు.
తెలుగు మీడియా విషయంలో జగన్ ఓ విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. తెలుగులో ఎన్ని న్యూస్ పేపర్స్, ఛానెల్స్ ఉన్నప్పటికీ ఏ విషయాన్ని అయినా రచ్చ రచ్చ చేయాలి అంటే ఆంధ్రజ్యోతి, టీవీ 9 ముందు ఉంటాయి. అలాంటి వారిని ఇద్దరినీ హర్ట్ చేసి మిగిలిన ఎంతమందిని పిలిచినా ప్రయోజనం ఏముంటుంది ? ఏది అయితే చేయకూడదో అదే చేసి తెలుగు మీడియా ని జగన్ తన పాదయత్రకి సాయం చేయమని అడగడంలో అర్ధం ఉందా ?. ఎవరయ్యా బాబూ జగన్ సలహాదారులు ?