Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాలలో ప్రజలను బెదిరించి టీడీపీకి ఓట్లేయించుకున్నారని వైఎస్సార్ సీపీ అదినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎనిమిదో వర్థంతి సందర్భంగా వైసీపీ భవిష్యత్ కార్యాచరణను ఆయన వివరించారు. కోటి కొత్త కుటుంబాలను వైసీపీ కుటుంబంలో చేర్చాలని జగన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు వైసీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి వైసీపీ లో కొత్త సభ్యులను చేర్చాలని ఆయన కోరారు. అక్టోబరు 27 నుంచి ఆరు నెలల పాటు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని జగన్ చెప్పారు. పాదయాత్రలో ప్రతి వైసీపీ కార్యకర్త తన వెంట నడవాలని, తనకు తోడుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
పాదయాత్రతో ముఖ్యమంత్రికి దిమ్మతిరిగి పోవాలని జగన్ వ్యాఖ్యానించారు. నంద్యాలలో టీడీపీపై అభిమానంతో ప్రజలు ఓట్లు వేయలేదని, అధికారంలో ఉన్న టీడీపీకి ఓటేయకపోతే పింఛన్ రాదన్నభయంతో ఆ పార్టీని గెలిపించారని జగన్ విశ్లేషించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేశారని, ఉద్యోగాలు కల్పించలేదని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలు చేయలేదని విమర్శించిన జగన్ ….హామీలు ఏవీ నిలబెట్టుకోకపోయినా టీడీపీని ప్రజలు గెలిపించటానికి కారణం ఆ పార్టీ చేసిన బెదిరింపులే అని మండిపడ్డారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలను అమలుచేసి ప్రజలందరి కష్టాలు తీరుస్తానని జగన్హామీ ఇచ్చారు. పాదయాత్రలో తనకు రాష్ట్ర ప్రజల దీవెనలు కావాలని ఆయన కోరారు.
మరిన్ని వార్తలు: