Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల ప్రచారం మొదలు అయినప్పటినుంచి వైసీపీ అధినేత జగన్ ప్రసంగాల ధోరణి పాత చింతకాయ పచ్చడి లాగే వుంది. ఓ సారి చంద్రబాబుని కాల్చి చంపాలని, ఇంకోసారి ఆయన్ని ఉరి తీయాలని చెప్పి నానా విమర్శలతో పాటు ఈసీ తాఖీదులు కూడా వచ్చాయి. ఆ తరువాత నంద్యాలలో జగన్ ఎన్ని బహిరంగ సభల్లో పాల్గొన్నా పాడిందే పాడుతున్నాడు. తాజాగా చింత అరుగులో జగన్ ఏమి చెప్పాడో చూస్తే మీకే మేటర్ అర్ధం అవుతుంది.
- మనం వేసే ఓటు ఎవరినో ఎమ్మెల్యేనే చేసేందుకు మాత్రమే కాదు.. చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనపై వేయబోతున్న ఓటు
- మీరు వేసే ఓటు ధర్మానికి, అధర్మానికి వేసే ఓటు , విశ్వసనీయతకు అర్థం తీసుకొచ్చేలా ఓటు వేయాలి.మూడున్నరేళ్లలో చంద్రబాబు, మంత్రులను.. నంద్యాల రోడ్ల మీద ఎప్పుడైనా చూశారా..?
- చంద్రబాబు మూడేళ్లలో ఒక్క ఇళ్లైనా కట్టించారా..? వైఎస్‌ఆర్ పాలనలో నంద్యాలలో 21,800 పెన్షన్లు ఉంటే.. చంద్రబాబు పాలనలో 15 వేలకు కుదించారు:
- చంద్రబాబు పాలనలో రేషన్ బియ్యం తప్ప ఇంకా ఏం రావటం లేదు. నంద్యాలలో కాలనీల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
- బాబు వస్తే జాబు వస్తుందన్నారు..జాబు రాకపోతే ప్రతి నిరుద్యోగికి రూ.2 వేల చొప్పున భృతి ఇస్తామన్నారు. ఈ 38 నెలల్లో ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.78 వేలు బకాయి పడ్డారు
- ముఖ్యమంతి కావడానికి చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పారో చూశాం.. ఎన్నికల తర్వాత కర్నూలు సాక్షిగా స్వాతంత్ర్య వేడుకల్లో..ఇచ్చిన హామీల్లోనూ ఒక్కటీ అమలు చేయలేదు.
- కర్నూలుకు ఎయిర్‌పోర్టు తెస్తామన్నారు, ట్రిపుల్ ఐటీ పెట్టిస్తామన్నారు.. స్మార్ట్ సిటీ చేస్తానన్నారు, ఉర్దూ వర్సిటీ, మైనింగ్ స్కూల్ తెస్తామన్నారు.
- అవుకు వద్ద ఇండస్ట్రియల్ పార్క్.. ఆదోని, ఎమ్మిగనూరులో అపెరల్ పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు.
- నంద్యాల ఉపఎన్నిక వచ్చేసరికి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు.చంద్రబాబు తన దగ్గర ఉన్న పోలీస్ బలంతో ఓటు అడుగుతున్నారు.
- నా దగ్గర చంద్రబాబులా డబ్బులు లేవు..నా దగ్గర చంద్రబాబులా పోలీసులు లేరు..నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు.
ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చూపే చానళ్లు, పేపర్లు లేవు.నాకున్నదల్లా దివంగత నేత ఇచ్చిన పెద్ద కుటుంబమే నా ఆస్తి - జగన్ అబద్దం చెప్పడు.. మోసం చేయడు.. జగన్ వాళ్ల నాన్న మాదిరే మాటపై నిలబడతాడన్న.. నమ్మకం, విశ్వసనీయతే నా ఆస్తి. దేవుడి దయ, మీ ఆశీస్సులు నాకు కావాలి
- ధర్మాన్ని బతికించండి.. వైఎస్‌ఆర్ సీపీని గెలిపించండి
ఇప్పుడు చెప్పండి… జగన్ కాస్త కొత్త మాటలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా ? లేదంటారా ?.
మరిన్ని వార్తలు: