Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావించి విమర్శలు చేయడం ఎన్నో సార్లు చూసాం. తెలంగాణాలో టీడీపీ దెబ్బతిన్నాక ఈ ఇద్దరు నేతలు నేరుగా ఢీకొట్టే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అయితే ఆ లోటు తెలియనివ్వకుండా కెసిఆర్ అప్పుడప్పుడు చంద్రబాబు మీద విరుచుకుపడుతుంటారు. చంద్రబాబు ఏపీలో కూడా ఓడిపోతే బాగుండని కోరుకుంటారు. అయితే ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత ఏపీ లో ప్రతిపక్ష నేత జగన్ దే. అందుకే ఆయన్ని సపోర్ట్ చేస్తూ కెసిఆర్ చాలా మాట్లాడారు.
2014 ఎన్నికల ముందు తెలంగాణ లో నేను, ఆంధ్రాలో జగన్ గెలుస్తాం. మేమిద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకుంటాం, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకుంటాం అన్న ధోరణిలో మాట్లాడారు కెసిఆర్. కానీ 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచేశారు. ఆ తర్వాత అధికార టీడీపీ ఎదుర్కొన్న తొలి ఎన్నిక నంద్యాల ఉప ఎన్నిక. అక్కడ గెలవడం టీడీపీ కి ఎంతో అవసరం. కానీ ఈ మధ్య ఏపీ లో ఎన్నికల గురించి మా ఫ్రెండ్ ఓ సర్వే జరిపాడంటూ కెసిఆర్ మాట్లాడారు. ఫ్రెండ్ సర్వే అని చెబుతూ వైసీపీ గెలుస్తుందని కెసిఆర్ చెప్పకనే చెప్పారు. నంద్యాల ఉపఎన్నికల నేపథ్యంలో కెసిఆర్ వ్యాఖ్యలు కీలకం అయ్యాయి. అయితే జరిగింది వేరు. నంద్యాల ప్రజలు టీడీపీ కూడా ఊహించనంత మెజారిటీ కట్టబెట్టారు. జగన్ ఎంత పోరినా ఓటమి తప్పలేదు. యధాప్రకారం ఇంకోసారి కెసిఆర్ కోరిక తీర్చడంలో జగన్ విఫలమయ్యారు.
మరిన్ని వార్తలు: