రెడ్డి మీదకి రెడ్డిని వదులుతున్న రెడ్డి.

Ysrcp leader Pedda reddy comments on JC brothers

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పార్టీ ఏదైనా తాడిపత్రిలో గెలవడం జేసీ కి కొట్టిన పిండి . అందుకే ఇంట ఎలాగైనా గెలుస్తామన్న ధైర్యంతో బయట కూడా రచ్చ రచ్చ చేస్తుంటారు జేసీ బ్రదర్స్. ఇప్పుడు దాకా వారు అనుకున్నట్టే జరుగుతోంది. అందుకు ఓ కారణం ఏమిటంటే తాడిపత్రిలో రెడ్ల సంఖ్య ఎక్కువగా ఉండటం. ఇప్పుడు ఇదే విషయాన్ని తనకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చూస్తున్నారు తాడిపత్రిలో జేసీ రాజకీయ ప్రత్యర్థి , వైసీపీ నాయకుడు పెద్దారెడ్డి.

జేసీ బ్రదర్స్ ని కట్టడి చేయడానికి పెద్దారెడ్డి స్వయంగా రెడ్డి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. తమ స్వార్ధం కోసం జేసీ బ్రదర్స్ చంద్రబాబు వద్ద రెడ్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని పెద్దారెడ్డి విమర్శిస్తున్నారు. బాబు సభల్లో రెడ్లని ఉద్దేశించి జేసీ మాట్లాడడం చూసాకే పెద్దారెడ్డి ఈ ఆయుధం ప్రయోగించడం మొదలెట్టారు. అప్పటిదాకా జేసీ ని ఎలా ఎదుర్కోవాలో పెద్దారెడ్డికి అర్ధం కాలేదు. జేసీ రెడ్ల గురించి మాట్లాడడం మొదలు పెట్టాక పెద్దారెడ్డి దాన్నే ఆయుధంగా మలుచుకున్నారు. దాంతో పాటు పెద్దారెడ్డి వేసే ఓ ప్రశ్న కూడా జేసీ బ్రదర్స్ ని ఇబ్బంది పెడుతోంది. జేసీ కుటుంబానికి ఓట్లు వేస్తున్న రెడ్లు ఎప్పుడైనా వారి ఎదురుగా కుర్చీలో కుర్చున్నారా అని పెద్దారెడ్డి అడుగుతున్నాడు. ఇందులో నిజానిజాలు ఏమిటో తెలియకపోయినా జేసీ బ్రదర్స్ దూకుడు చూసే వాళ్లకి ఈ మాటలు నిజమే అనిపిస్తున్నాయి. ఏదేమైనా తాడిపత్రిలో రెడ్డి మీదకి రెడ్డిని వదులుతున్న రెడ్డి అనే సరికొత్త దృశ్యం కనిపిస్తోంది.

మరిన్నివార్తలు 

ఔననక పోయినా కాదనడం లేదట…రజని మార్క్ డైలాగు.