Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నిక ఫలితం వైసీపీ ని ఒక్కసారిగా సమస్యల సుడిగుండంలో పడేసింది. ఇన్నాళ్లు 2019 లో వైసీపీ అధికారంలోకి వస్తుందని నమ్మకం పెట్టుకున్న నాయకులంతా ఆ భ్రమల్లో నుంచి వాస్తవంలోకి వచ్చి భవిష్యత్ గురించి ఆలోచనలో పడ్డారు. జగన్ తో రాజకీయ ప్రయాణం వల్ల ఒరిగేది ఏమీ లేదని అర్ధమైన నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. ఆ లిస్ట్ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. రెండు రోజుల కిందట ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయ్యి కాషాయ కండువా కప్పుకోడానికి రెడీ గా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారట. అమిత్ షా కూడా ఆయనకి సాదర ఆహ్వానం పలికినట్టు తెలుస్తోంది.
ఆది నుంచి అండగా ఉంటున్న మేకపాటి కూడా నిజంగా హ్యాండ్ ఇస్తే జగన్ కి షాక్ తగలడం ఖాయం. ఇప్పటికే కడప కి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు టీడీపీ తో టచ్ లోకి వెళ్లినట్టు వస్తున్న వార్తలు జగన్ ని బెంబేలు ఎత్తిస్తున్నాయి. ఇప్పుడు మేకపాటి గురించి కూడా లోటస్ పాండ్ కి ఉప్పు అందిందట. దీంతో విజయసాయి సహా కొందరు సీనియర్ నాయకులు జగన్ ఆదేశాల మేరకి పక్క చూపులు చూస్తున్న నాయకులని బుజ్జగించే పనిలో పడ్డారట.
మరిన్ని వార్తలు: