బిగ్‌బాస్‌లో రచ్చరచ్చ..

actor dhanraj wants bigg boss author contents about Deeksha Panth

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్టీఆర్‌ వచ్చిన శని, ఆదివారాలు తప్ప మిగిలిన రోజుల్లో బిగ్‌బాస్‌ షో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది. ఆ కారణంగానే షో నిర్వాహకులు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటూ తెరపైకి తీసుకు వచ్చారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ప్రముఖ స్టార్‌ను బిగ్‌బాస్‌ ఇంట్లోకి పంపించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని ఒక హాట్‌ బ్యూటీ దీక్షా పంత్‌ను బిగ్‌బాస్‌ ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే ఇంట్లో జాయిన్‌ అయ్యిన దీక్షా పంత్‌ అక్కడ తన అందాలతో రచ్చ రచ్చ చేయడం ఖాయం అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న అర్చనతో పాటు దీక్షా తన అందాలతో హౌస్‌ను హీట్‌ ఎక్కించడం ఖాయం అంటున్నారు.

ఇప్పటికే వరకు దీక్షా నటించిన సినిమాల్లో హాట్‌ హాట్‌గా నటించిన విషయం తెల్సిందే. ఇక ఎంట్రీతోనే స్విమ్మింగ్‌ పూల్‌లో దూకేసి అందాలతో ఆకట్టుకుంది. ఈమె అందాలతో ఆకట్టుకోవడంతో పాటు, తన సెన్సిటివ్‌ మైండ్‌తో కూడా గేమ్‌ను రక్తి కట్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ధన్‌రాజ్‌ ఆమె గురించి మాట్లాడుతూ ఆమె ఇంట్లోకి రావడంతో రచ్చ మొదలైందని, ఆమె గురించి తనకు బాగా తెలుసని, కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఆమెతో సరదాగా ఉన్నా కూడా కష్టమే అంటూ తోటి హౌస్‌మెంట్స్‌ను హెచ్చరించడం జరిగింది. మొత్తానికి బిగ్‌బాస్‌లో దీక్షాపంత్‌ రచ్చ రచ్చ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ అమ్మడి ఎంట్రీతో అయిన బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ మొదలవుతుందేమో చూడాలి.

మరిన్ని వార్తలు:

పవన్‌ సినిమాల పరిస్థితి ఏంటి?

సాయి పల్లవి ఎంత ఎదిగి పోయింది..!

మెగాస్టార్‌ మూవీలో మెగాస్టార్‌?