లుంగీ రాజా కి చిరు క్లాస్?

chiru comments on ram charan rangasthalam 1985 title

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Chiranjeevi Comments On Ram Charan Rangasthalam 1985 Title 

” రంగస్థలం 1985 “… నిజంగానే ఈ టైటిల్ చాలా ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోంది. కానీ మాస్ పునాదులున్న మెగా ఫాన్స్ కి ఈ టైటిల్ నచ్చుతుందా లేదా అన్నదాంట్లో కొద్దిగా సందేహాలున్నాయి. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం దర్శకుడు సుకుమార్ మీద నమ్మకం ఉంచి ఆయన ఏది చెపితే అది చేస్తూ పోతున్నాడు. చివరకు గోదావరి జిల్లాల్లో అశేష జనవాహిని మధ్య లుంగీ తోనే షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించి అధికారిక, అనధికారిక ఫొటోస్ అన్నిటిలోను చరణ్ కేవలం లుంగీ తోనే ఇప్పటి దాకా దర్శనమిస్తూ వచ్చాడు.

ఇలా సుకుమార్ మీద పూర్తి విశ్వాసంతో ఆయన చెప్పినట్టు చేయడం కొందరు మెగా ఫాన్స్ కి నచ్చడం లేదట. చరణ్ ని లుంగీలో ఇంత డీ గ్లామర్డ్ గా చూపడం విషయంలో ఫాన్స్ అభ్యంతరాల గురించి చిరు ఏమీ అనకపోయినా సినిమా టైటిల్ రంగస్థలం 1985 విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ టాపిక్ మీద చరణ్ కి ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేయడం కూడా అవసరమని చిన్నపాటి క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. మేటర్ సుకుమార్ దాకా చేరడంతో ఆయనే చిరు ని కలిసి ఈ టైటిల్ అవసరాన్ని వివరించే ఛాన్స్ ఉందట.

మరిన్ని వార్తలు 

రంగస్థలం గురించి ఆసక్తికర విషయం

ఖైదీ నెంబర్ 150 కన్నా బ్రహ్మోత్సవం బెటర్.