ఊరించి ఉసూరుమనిపించిన తాప్సి

fans-negative-comments-on-taapsee-pannu-anando-brahma

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టాలీవుడ్‌లో పలువురు స్టార్‌ హీరోల సరసన నటించినా కూడా తాప్సికి అదృష్టం కలిసి రాకపోవడంతో స్టార్‌ ఇమేజ్‌ను దక్కించుకోలేక పోయింది. కొన్నాళ్ల పాటు తెలుగులో అటు ఇటుగా ప్రయత్నాలు చేసిన ముద్దుగుమ్మ బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో ఈమె మెల్ల మెల్లగా క్రేజ్‌ను దక్కించుకుంటూ వస్తుంది. ఈ సమయంలోనే మరోసారి తెలుగులో ‘ఆనందోబ్రహ్మ’ చిత్రంతో అవకాశం వచ్చింది. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాతో తాప్సి మరోసారి తెలుగులో బిజీ అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కాని తాప్సికి ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. 

‘ఆనందోబ్రహ్మ’ చిత్రంలో తన పాత్ర సూపర్‌, అద్బుతంగా ఉంటుంది, ఒక మంచి పాత్ర పోషించాను, హీరో స్థాయి పాత్ర అంటూ డబ్బాలు కొట్టుకున్న తాప్సి సినిమా విడుదలైన తర్వాత ఉసూరుమనిపించింది. ఆ చిత్రంలో తాప్సి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. ఆమె కనిపించింది కొద్ది సమయం, ఆ కొద్దిపాటి పాత్రలో కూడా తాప్సి ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. నటిగా విఫలం అయ్యింది. ఈ చిత్రం తర్వాత తాప్సి తెలుగులో రెగ్యులర్‌ చిత్రాలు చేస్తానంటూ ప్రకటించింది. ఆమె చేస్తాను అన్నా కూడా  అవకాశాలు వస్తాయని ఏ ఒక్కరు భావించడం లేదు. మళ్లీ ఆమె బాలీవుడ్‌కు వెళ్లి చిన్నా చితక పాత్రలు చేసుకోవాల్సిందే.

మరిన్ని వార్తలు:

అర్జున్‌రెడ్డికి శర్వానంద్‌కు సంబంధం ఏంటి?

ఉయ్యాలవాడ మరో బాహుబలి!!

ఇందుకే ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ను చూస్తున్నారు