పవన్‌పై కామెంట్స్‌ చేసిన మహేష్‌… మెగా ఫ్యాన్స్‌ సీరియస్‌ 

kathi mahesh controversy Comments On Pawan Kalyan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
బిగ్‌బాస్‌ షో ప్రారంభంకు ముందు కత్తి మహేష్‌ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. కాని బిగ్‌బాస్‌ షోలో ఆయన నాలుగు వారాలు ఉండటంతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఈనేపథ్యంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొనడం చేస్తున్నాడు. సినీ విశ్లేషకుడు మరియు నటుడు అయిన కత్తి మహేష్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ గురించి, జనసేన పార్టీ గురించి కొన్ని కామెంట్స్‌ చేశాడు. దాంతో ఇప్పుడు కత్తి మహేష్‌పై తీవ్ర స్థాయిలో మెగా ఫ్యాన్స్‌ ఆగ్రహంగా ఉన్నారు.

నీ స్థాయి ఏంటి, నివ్వు ఏంటి పవన్‌ను విమర్శించేంత స్థాయి నీకు ఉందా అంటూ సోషల్‌ మీడియాలో కత్తి మహేష్‌కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు ముందు సర్దార్‌ మరియు కాటమరాయుడు సినిమాల విషయంలో చెత్త సినిమాలు అంటూ రివ్యూ ఇచ్చిన మహేష్‌ , ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురి అయ్యాడు. ఇప్పుడు తాజాగా పవన్‌ పార్టీ జనసేన గురించి కామెంట్స్‌ చేయడంతో ఫ్యాన్స్‌ తీవ్రంగా స్పందిస్తున్నారు. బౌతికంగా కూడా దాడులు తప్పవు అని కాస్త సెలబ్రెటీ హోదా రాగానే శృతిమించి పోమాకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పవన్‌ చేస్తున్న సినిమాపై కూడా నమ్మకం లేదు అంటూ మహేష్‌ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కారణాల వల్ల మహేష్‌ను సోషల్‌ మీడియాలో పవన్‌ ఫ్యాన్స్‌ ఏకి పారేస్తున్నారు.

మరిన్ని వార్తలు:

రెచ్చగొడుతున్న వర్మ.. మూసుకున్న విహెచ్‌

కూతురు కోసం మంచి నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో…

నమ్మలేని నిజం… బిగ్‌బాస్‌ ఇంటికి బాలయ్య?